Mon. Jun 29th, 2026

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గత ఐదు దశాబ్దాలుగా నివసిస్తున్న ముంబైలోని ‘గెలాక్సీ అపార్ట్‌మెంట్స్’ను వీడబోతున్నట్లు తెలుస్తోంది. బాంద్రాలోని చింబై ప్రాంతంలో సల్మాన్ కుటుంబం కొత్తగా నిర్మించ తలపెట్టిన 6 అంతస్తుల సముద్రతీర నివాసానికి మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. సల్మాన్ తల్లి సల్మా ఖాన్ పేరిట ఉన్న ఈ స్థలంలో అత్యాధునిక వసతులతో కూడిన భవనాన్ని నిర్మించనున్నారు.

రెండేళ్ల క్రితం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల జరిగిన కాల్పుల ఘటన తర్వాత సల్మాన్‌కు Y+ భద్రతను కల్పించారు. ప్రస్తుతం ప్లాన్ చేసిన కొత్త ఇల్లు చాలా ప్రశాంతమైన వీధిలో ఉండటంతో, కుటుంబానికి మరింత ప్రైవసీ మరియు పటిష్టమైన రక్షణ చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే 1974 నుండి గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌తోనే ఉంటున్న ఖాన్ ఫ్యామిలీ, ఈ కొత్త నివాసంలోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు, రాజ్ అండ్ డీకే కాంబినేషన్‌లో ఒక సూపర్ హీరో యాక్షన్ చిత్రానికి, అలాగే ప్రముఖ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో ఒక పీరియాడిక్ డ్రామాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

The publish చిరునామా మారుస్తున్న సల్మాన్ ఖాన్.. 5 దశాబ్దాల తర్వాత ఎందుకిలా..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.