Sat. Aug 1st, 2026

మన టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. రవితేజ గత సినిమాల్లా కాకుండా దీనికి మాత్రం పూర్తిగా పాజిటివ్ బజ్ నెలకొంది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చారు కానీ ఇతర అప్డేట్స్ ప్రమోషన్స్ పరంగా సినిమా వెనుకబడే ఉందని చెప్పాలి.

ఇదే ఆగస్ట్ లో విడుదల అవుతున్న సినిమాలు అన్నీ ఆల్రెడీ ప్రమోషన్స్ లో మునిగి ఉన్నాయి కానీ ఇరుముడి బృందం మాత్రం ఇంకా మౌనంగానే ఉంది. రవితేజ నుంచి ఫుల్ పాజిటివ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది దీనికి బూస్టప్ ఇస్తే డెఫినెట్ గా మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. సో ఇకనైనా మేకర్స్ స్పీడ్ పెంచాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఆగష్టు 21న సినిమా తెలుగు, తమిళంలో విడుదల కానుంది.

The publish ‘ఇరుముడి’ మేకర్స్ స్పీడ్ పెంచాల్సిందే! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.