ఇటీవల సినీ పరిశ్రమను వరుస గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తమ నెక్స్ట్ చిత్రాల షూటింగ్ లో పలువురు ప్రముఖ నటులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే ఎన్టీఆర్, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు షూటింగ్ సమయాల్లో గాయపడగా, ఇప్పుడు ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా చేరింది.
ఒక డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో రష్మిక తుంటి భాగంలో గాయమైనట్లు తెలుస్తుంది. ఈ గాయం తీవ్రత దృష్ట్యా వైద్యులు ఆమెకు 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, ఆమె త్వరగా కోలుకోవడానికి ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని వైద్యులు నిర్దేశించడాన్ని బట్టి ఈ గాయం ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఎంతో శారీరక శ్రమతో కూడిన డాన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం వల్లే ఈ గాయం అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా కఠినమైన శిక్షణ పొందే అథ్లెట్లలో మాత్రమే కనిపించే ఇలాంటి తీవ్రమైన టెండన్ గాయాలు రష్మికకు కావడం ఆమె కెరీర్‌కు చిన్నపాటి అద్దంకిగా మారింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
The put up సినీ పరిశ్రమను వేధిస్తున్న గాయాలు: ఎన్టీఆర్, చరణ్ ల బాటలోనే రష్మిక first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
