The Paradise Teaser: న్యాచురల్ స్టార్ నాని అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ రిలీజ్ తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. ఈ టీజర్ 1 నిమిషం 35 సెకన్ల మ్యాడ్‌నెస్‌తో ఉండబోతుందని ప్రకటించిన చిత్ర యూనిట్.. అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా ‘జడల్ జమానా’ అంటూ విడుదల చేసిన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల తనదైన మాస్ టేకింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నాని నటన, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం, అనిరుధ్ మ్యూజిక్ కాంబినేషన్ ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో భాగం అయ్యారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే సినీ వర్గాల్లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 6న విడుదల కానున్న టీజర్ నాని కెరీర్‌లో మరో సెన్సేషనల్ అప్‌డేట్‌గా నిలుస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.
1min 35 seconds of Insanity able#TheParadise Teaser out on August sixth
Get able for Jadal Zamana
Herbal Megastar @NameisNani in an @odela_srikanth cinema
An @anirudhofficial musical @themohanbabu @11Lohar @sudhakarcheruk5 @TheRaghav_Juyal @sonalikulkarni… pic.twitter.com/rc8JYlH66j— THE PARADISE (@TheParadiseOffl) July 31, 2026
