ప్రస్తుతం మన తెలుగు సినిమా నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం కూడా ఒకటి. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఒకోకటిగా అప్డేట్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి మొదట హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
కానీ తన తర్వాత మళ్ళీ థమన్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక ఈ సినిమాకి అందిస్తున్న మ్యూజిక్ విషయంలో చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆదర్శ కుటుంబం లో చాలానే సందర్భానుసారంగా సాగే పాటలు, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ధురంధర్ సినిమాలోలా ఉంటాయని తెలిపాడు. కానీ ఆ సినిమాలో చేసిన వర్క్ మనమే ఇంతకు ముందు ఎన్నో చేశామని..
ఓజి, అరవింద సమేత లాంటి సినిమాల్లో ఆల్రెడీ మనం చేసిందే వాళ్ళు కూడా చేసారని థమన్ తెలిపాడు. అలాగే ఆదర్శ కుటుంబం సినిమా ఫుల్ ఫన్ తో ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని త్రివిక్రమ్ గారి నువ్వు నాకు నచ్చావ్ రోజుల్లో ఉండేలా ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని థమన్ చెప్పడం ఇపుడు ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
The submit ‘ఆదర్శ కుటుంబం’ కోసం ‘ధురంధర్’ స్టైల్ లో అంటున్న థమన్.. కానీ మనదే వాళ్ళు ట్రై చేశారు! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
