Sat. Aug 1st, 2026

న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ టీజర్‌ను ఆగస్టు 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

1 నిమిషం 35 సెకన్ల ఈ టీజర్‌ ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తి స్థాయి మ్యాడ్‌నెస్ అందిస్తుందని మేకర్స్ ధీమా ఇస్తున్నారు. అయితే, ఈ టీజర్‌లోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేయాలని ముందుగా భావించినప్పటికీ, షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

బ్లాక్‌బస్టర్ ‘దసరా’ చిత్రం తర్వాత నాని మరియు దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తి సురేష్ ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుందని సమాచారం. రాఘవ్ జుయల్, మోహన్ బాబు విలన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

The submit ‘ది ప్యారడైజ్’ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్ చేసిన నాని..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.