Sat. Aug 1st, 2026
Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!

Rajinikanth Present: కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ను ‘ది డెడ్లీ డాక్టర్’గా చూపించబోతుండగా.. ఆయన మాస్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘ధర్మన్’ షూటింగ్‌లో పాల్గొంటున్న రాశీ ఖన్నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

రజనీకాంత్ నుంచి అందుకున్న ఈ ప్రత్యేక గిఫ్ట్‌కి సంబంధించిన విషయాన్ని రాశీ ఖన్నా అభిమానులతో పంచుకున్నారు. తలైవా తన చేతుల మీదుగా రాశీకి హిమాలయన్ బుక్ (Himalayan E book)ను బహుమతిగా అందించారు. ఈ స్పెషల్ గిఫ్ట్‌పై రాశీ ఖన్నా ఎంతో సంతోషంగా వ్యక్తం చేశారు. రజనీకాంత్ నుంచి బహుమతిగా పుస్తకం అందుకోవడం తనకు ప్రత్యేకమైన అనుభూతిగా నిలిచిందని ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించనుండగా, యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. 2027 సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.