Wed. Apr 22nd, 2026

టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ఎప్పుడో షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ సినిమాను సంక్రాంతి 2026 కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఇటీవల ఈ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తారేమో అనే చర్చ మొదలైంది.

అయితే, ఆ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు వారు రెడీ అయ్యారు. ‘భీమవరం బల్మ’ అంటూ సాగే ఈ పాటను నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. కాగా ఈ పాటను పాడింది కూడా నవీన్ పొలిశెట్టి కావడం విశేషం. ఇక ఈ సినిమా నుండి వరుస అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు.

మారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి ఔట్ అండ్ ఔట్ కామెడీ రోల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The publish ఎట్టకేలకు నవీన్ పొలిశెట్టి కూడా మొదలెట్టాడు.. ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.