పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. కర్ణుడి కుమారుడు వృషసేనుడు పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని.. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు నటిస్తున్నాడని రూమర్ వినిపిస్తోంది. అలాగే కొన్ని అతిధి పాత్రలు కూడా ఉన్నాయట. మొత్తానికి ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ కనిపించబోతోంది.
కాగా లాస్ట్ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ పాత్రల పై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలలో రూపొందుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి.
The publish ‘కల్కి సీక్వల్’ పై క్రేజీ రూమర్ ? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
