కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే మంచి స్పందనను రాబట్టింది, దీనికి అనుగుణంగానే మొదటి రోజు వసూళ్లు కూడా చాలా బలంగానే వచ్చాయి. ఇక ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందన కారణంగా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగింది, దీనివల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగింది. ఎంతగా అంటే ‘బుక్ మై షో’లో 1,56,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది మొదటి రోజుతో పోలిస్తే టికెట్ అమ్మకాలలో 35% ఎక్కువ.
మొత్తానికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 300 అదనపు షోలను ఏర్పాటు చేశారు. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమాలో త్రిగుణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. మొత్తమ్మీద ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ మూవీ మరి ఏ రేంజ్ కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.
The publish ‘చెన్నై లవ్ స్టోరీ’కి పెరుగుతున్న డిమాండ్.. అందుకే ? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
