బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు యశ్.. రావణుడిగా కనిపించనున్నారు. ఆయన సతీమణి మండోదరి పాత్రలో కాజల్ నటిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ వాస్తవానికి 2026 జూలై 24న విడుదల కావాల్సి ఉండగా, అది వాయిదా పడింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్త పంపిణీదారుగా చేరడంతో, 2026 జూలై 30న థియేటర్లలో విడుదల కానున్న ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చిత్రంతో పాటు ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
తాజా ఊహాగానాల ప్రకారం, చిత్రనిర్మాతలు ఈ ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేస్తారని వస్తున్న వార్తలకు ఒక రోజు ముందు, అంటే 2026 జూలై 29న డిజిటల్‌గా విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఏది ఏమైనా మొత్తానికి సినీప్రియులందరి దృష్టి కూడా ప్రస్తుతం ‘రామాయణ’ మీదే ఉంది. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విదేశీ నిపుణులు పని చేస్తున్నారు. పైగా సరికొత్త టెక్నాలజీ, భారీ సెట్స్‌తో ఇండియా మరియు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
The submit ‘రామాయణ’ ట్రైలర్ పై క్రేజీ న్యూస్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
