Thu. May 21st, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు, అర్ధరాత్రి షోలు వేస్తుంటారు. కానీ ‘పెద్ది’ మేకర్స్ మాత్రం ఒక సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల కంటే ముందే, అంటే జూన్ 3వ తేదీ రాత్రి 08:00 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ తెలంగాణ ప్రభుత్వానికి అభ్యర్థన పంపినట్లు సమాచారం.

ఒకవేళ ప్రభుత్వం నుంచి ఈ ముందస్తు ప్రీమియర్ షోలకు అనుమతి వస్తే గనుక, రామ్ చరణ్ అభిమానులకు ఇది ఒక రేంజ్ పండగనే చెప్పాలి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జూన్ 3 రాత్రి పడే ఈ స్పెషల్ ప్రీమియర్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఎలాంటి రికార్డులు సృష్టించబోతోందో ముందే తేలిపోనుంది.

The publish ‘పెద్ది’ ప్రీమియర్స్ కోసం రిక్వెస్ట్.. ఓకే అయితే మాత్రం ఊచకోతే..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.