Ram Charan Hints at Large Twist in Peddi: మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఒక వినూత్నమైన ప్లాన్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబును స్వయంగా తన కారులో డ్రైవ్‌కు తీసుకెళ్లారు. ఈ డ్రైవ్ సందర్భంగా ఇద్దరి మధ్య సినిమా షూటింగ్ విశేషాలు, వ్యక్తిగత అనుభవాలపై ఆసక్తికరమైన సంభాషణ సాగింది. ఈ సరదా సంభాషణలో భాగంగా పెద్ది గురించి చాలా విషయాలు పంచుకున్నారు. పెద్ది షూటింగ్ సమయంలో రామ్ చరణ్ పడిన కష్టాలు, బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి ఇద్దరూ చర్చించుకున్నారు.
పెద్ది సినిమాలోని పాత్రల కోసం బుచ్చిబాబు తనను తీవ్రంగా టార్చర్ చేశాడంటూ రామ్ చరణ్ నవ్వుతూ చెప్పారు. క్రికెటర్ బాడీ కావాలని, ఆ తర్వాత కొద్ది రోజులకే పవర్ఫుల్ రెజ్లర్ బాడీ కావాలని.. బుచ్చిబాబు తనను డిమాండ్ చేశాడని చరణ్ వివరించారు. సినిమా టైమ్‌లైన్ తక్కువగా ఉన్నప్పటికీ.. కథపై ఉన్న ప్రేమతో బుచ్చిబాబు అడిగిన ప్రతి లుక్‌ను తీసుకురావడానికి తాను ఎంతో శ్రమించానని చరణ్ వెల్లడించారు. అయితే ఈ డ్రైవ్‌లో చరణ్, బుచ్చిబాబు ఒక విషయాన్ని మాత్రం కాస్త గట్టిగానే చెప్పారు. అదే సినిమా హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది.
పెద్ది చిత్రంలో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే చాలా కీలకం. బుచ్చిబాబు గత చిత్రం ‘ఉప్పెన’ క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగా షాక్‌కు గురిచేసిందో.. పెద్దిలో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్ దాని కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అసలు ఇంతటి అద్భుతమైన, ఊహించని ట్విస్ట్‌ను ఎలా రాశావు బుచ్చి? అంటూ చరణ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ లెక్కన సినిమాలో ఢిల్లీ ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి చరణ్ చెబుతున్న ఆ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే.. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. లెట్స్ వెయిట్ అండ్ సీ.
