Drishyam 3 OTT Spouse: భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత విజయవంతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ మూడో భాగంపై అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి.. అన్ని డిజిటల్ ఫార్మాట్ల (SVOD, TVOD) ఎక్స్‌క్లూజివ్ రైట్స్ తమకే ఉన్నాయని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా స్పష్టం చేసింది.
ఈ ఫ్రాంచైజీకి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఫ్యాన్ బేస్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రైమ్ వీడియో భారీ ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసి ఈ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే ‘దృశ్యం 1’, ‘దృశ్యం 2’ భాగాలు అమెజాన్ ప్రైమ్‌లోనే అందుబాటులో ఉండటం, వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో.. మూడో భాగాన్ని కూడా తమ ప్లాట్‌ఫామ్‌లోనే ఉంచేలా మేకర్స్‌తో అమెజాన్ ముందే ఒప్పందం కుదుర్చుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రికానున్న ఈ చిత్రం.. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాతే ఓటీటీలోకి రాబోతుంది. సాధారణంగా ఉండే 30 నుంచి 35 రోజుల విండో పీరియడ్‌ను మేకర్స్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. జీతు జోసెఫ్ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో, మోహన్‌లాల్ తన మార్క్ ‘జార్జ్‌కుట్టి’ పాత్రలో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ముగింపు ఎలా ఉండబోతుందో చూడాలని థియేటర్ ఆడియన్స్‌తో పాటు ఓటీటీ లవర్స్ కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
