మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రమే పెద్ది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు వరుస ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తుంది. ఇక లేటెస్ట్ గా దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ స్పెషల్ డ్రైవ్ కి వెళుతూ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇక దీనిలో అనేక ఇంట్రెస్టింగ్ అంశాలు ఇద్దరూ షేర్ చేసుకోవడం జరిగింది.
అయితే ఇందులో రామ్ చరణ్ పెద్ది సినిమా మొత్తంలో తనకి బాగా నచ్చిన ఎపిసోడ్ ఏంటి అనేది రివీల్ చేశారు. ఈ సినిమాలో తనకి మొత్తం ఢిల్లీ ఎపిసోడ్ ఎంతో ఫేవరెట్ అని మెగాపవర్ స్టార్ తెలిపాడు. అక్కడ నుంచే సినిమా మరింత బాగుంటుంది అని అసలు అదే సినిమాలో మెయిన్ పాయింట్ అని రివీల్ చేసాడు. దీనితో చరణ్ ని ఎంతగానో కదిలించిన ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జూన్ 4 వరకు ఆగాల్సిందే.
The submit ‘పెద్ది’ మొత్తంలో తన ఫేవరెట్ ఎపిసోడ్ రివీల్ చేసేసిన చరణ్.. సినిమాలోనే బిగ్గెస్ట్ హైలైట్ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
