మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన బ్లాక్ బస్టర్ హిట్ వాల్తేరు వీరయ్య దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేయనున్న అవైటెడ్ సినిమా మెగాస్టార్ కెరీర్ 158 వ చిత్రం నేడు అట్టహాసంగా లాంచ్ అయ్యిన సంగతి తెలిసిందే. నిర్మాత కే వెంకట నారాయణ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది కాగా భారీ లెవెల్లో ఈ సినిమా ముహూర్త కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే టాలీవుడ్ నుంచి అనేకమంది సినీ పెద్దలు, ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తున్నట్టు మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు. కానీ అనూహ్యంగా ఇవాళ రామ్ చరణ్ ప్రెజెన్స్ మిస్ కావడం ఒకింత అభిమానులని డిజప్పాయింట్ చేసింది. దీనితో చరణ్ రాకపోవడానికి కారణం ఏంటా అని అభిమానులు సస్పెన్స్ లో ఉన్నారు. అయితే చరణ్ ఇప్పుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి బహుశా వాటిలో బిజీగా ఉండి రాలేదేమో కానీ చరణ్ ప్రెజెన్స్ కూడా ఉండి ఉంటే ఈ కార్యక్రమం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉండి ఉండేది.
The publish మెగా 158: చరణ్ ఎందుకు మిస్సయినట్టు? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
