Thu. May 21st, 2026

టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘రావు బహదూర్’ అనే చిత్రాన్ని ఆయన రిలీజ్‌కు రెడీ చేశాడు. ఇక తన నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ఆయన కెరీర్‌లో 16వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘#SD16’ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్‌లుక్ ను మే 22న ఉదయం 11:07 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను షేర్ చేశారు.

‘ప్రతీ అడవిలో ఒక నిశ్శబ్దం ఉంటుంది.. అది ఒక పెద్ద తుఫానును దాచి ఉంచుతుంది’ అంటూ ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై మేకర్స్ ఒక హింట్ ఇచ్చారు. ఈ చిత్రం పూర్తి వైల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర ప్రీ-లుక్ పోస్టర్ చూస్తుంటే సత్యదేవ్ ఈసారి సరికొత్త రగ్గడ్ లుక్‌లో, విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్ధమవుతోంది.

ఈ చిత్రానికి అజయ్ నాగ్ దర్శకత్వం వహిస్తుండగా, రుద్ర పిక్చర్స్ మరియు పంచభూత క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శశిధర్ రెడ్డి పడమటి, శివచరణ్ రెడ్డి జక్కిడి ఈ చిత్రన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా.. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

The submit సత్యదేవ్ నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్.. టైటిల్, ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఫిక్స్..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.