Sun. Jun 28th, 2026

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సర్‌ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఇటీవల నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. కానీ, ఇప్పుడు అఫీషియల్‌గా చిత్ర మేకర్స్ ఈ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. భార్య, ఇద్దరు పిల్లలతో వెంకీ ఈ పోస్టర్స్‌లో కనిపిస్తున్నాడు. అయితే దీనికి #AK47 అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌ను జోడించడంతో.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు త్రివిక్రమ్ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ దసరా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.

The submit ఫ్యామిలీ ఫోటోతో రిలీజ్ డేట్ పట్టుకొచ్చిన ‘ఆదర్శ కుటుంబం’..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.