టాలీవుడ్‌లో భారీ చిత్రాల కోసం కోలీవుడ్ సినిమాటోగ్రాఫర్లను తెచ్చుకోవడం పాత సంప్రదాయం కాగా, ఇప్పుడు దానికి భిన్నంగా తెలుగు కెమెరామెన్ నికేత్ బొమ్మి ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ తమిళ చిత్రం ‘ధర్మన్’కు సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికై సరికొత్త రికార్డు సృష్టించాడు.
షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన నికేత్.. తెలుగులో ‘ఈ నగరానికి ఏమైంది’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించి అక్కడి మేకర్స్ దృష్టిని ఆకర్షించాడు.
ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాణంలో, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రాబోతున్న రజినీకాంత్ మెగా ప్రాజెక్ట్ ‘ధర్మన్’కు నికేత్ టాలెంట్‌ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఈ భారీ సినిమాతో నికేత్ బొమ్మి సౌత్ ఇండియాలోనే టాప్ లీగ్ సినిమాటోగ్రాఫర్ల సరసన చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
The put up రజినీకాంత్ ‘ధర్మన్’లో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ టెక్నీషియన్.. ఎవరంటే..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
