Wed. Apr 22nd, 2026

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి ప్రభాస్ తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు మారుతి పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కించాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే, ఈ సినిమాలో తన పాత్రపై హీరోయిన్ మాళవిక మోహనన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఆమె ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఓ పక్కా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపింది. కొందరు హీరోయిన్లకు ఇలాంటి సినిమాల్లో కేవలం గ్లామర్ కోసమో.. లేదంటే ఓ పవర్‌ఫుల్ రోల్ ఇచ్చి ముగించేయడమో చేస్తారు.. కానీ, తనకు ఈ సినిమాలో అటు గ్లామర్, ఇటు పర్ఫార్మెన్స్ పరంగా రెండు ఉన్న పాత్ర లభించిందని.. తనకు ఇది చాలా బాగా నచ్చిందని ఆమె పేర్కొంది.

ఇక ఈ సినిమాలో మిగతా ఇద్దరు హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు దక్కాయని ఆమె పేర్కొంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీ.జీ.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The put up ‘రాజాసాబ్’ పై మాళవిక కాన్ఫిడెంట్.. అదిరిపోతుందట..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.