Wed. Apr 22nd, 2026

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల తన ప్రొడక్షన్ హౌస్ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ మూసివేస్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం ఆయన హీరో శింబుతో కలిసి #STR49 పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ ప్రోమోను శింబుతో కలిసి షూట్ చేయగా, అది అక్టోబర్ 4న విడుదల కానుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్‌ను ఎంపిక చేసినట్టు తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు వెట్రిమారన్ ఎక్కువగా జి.వి.ప్రకాష్ కుమార్‌తోనే పనిచేశారు. అయితే ఈసారి శింబు హీరోగా వస్తున్న ఈ సినిమాతో కొత్త కాంబినేషన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా శిలంబరసన్ – అనిరుధ్ కాంబినేషన్‌లో కూడా మొదటి చిత్రం కానుంది. గతంలో ఈ సినిమా ‘వడా చెన్నై 2’ అని ప్రచారం జరిగినా, వెట్రిమారన్ ఆ రూమర్స్‌ను ఖండించారు. #STR49 పూర్తయిన తర్వాత ఆయన ‘వడా చెన్నై 2’పై దృష్టి సారించనున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

The post శింబు కోసం వెట్రిమారన్ తొలిసారి ఇలా..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.