బాహుబలి ఫ్రాంచైజీ లో కట్టప్ప పాత్ర అత్యంత కీలకమైనది. బాహుబలి: ది కంక్లూజన్ లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు హతం చేశాడో?” అనే ప్రశ్న ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేకెత్తించింది. సీనియర్ తమిళ నటుడు సత్యరాజ్ ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు.
ఇక ఇప్పుడు రచయిత విజయేంద్ర ప్రసాద్ కట్టప్ప జీవితం ఆధారంగా పూర్తి స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనను ఆయన కుమారుడు మరియు డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళితో చర్చించారు. కథలో కట్టప్ప వ్యక్తిగత జీవితం, అతను రాజ్యానికి అత్యంత నమ్మకమైన శిష్యుడిగా ఎలా ఎదిగాడు అన్న అంశాలు వర్ణించబడతాయని తెలుస్తోంది.
అయితే, ఈ స్క్రిప్ట్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దీనిని దర్శకత్వం వహిస్తారా లేదా మరో దర్శకుడికి అప్పగిస్తారా అనేది ఇంకా నిర్ణయించబడ లేదు. దీనికి సంబంధించి త్వరలో మేకర్స్ అధికారికంగా అప్‌డేట్ ఇవ్వనున్నారట.
The post కట్టప్ప కథను పట్టుకొస్తున్నారుగా..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
