Wed. Apr 22nd, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తూ ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. పవర్‌స్టార్‌ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని ఆశించారో డైరెక్టర్ సుజీత్ అలాగే చూపించడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా OG మేనియాలో మునిగిపోతున్నారు.

ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో ఓజీ చిత్రాన్ని వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అల్లు అర్జున్ ఈ సినిమాపై తన రివ్యూ ఇస్తారా లేదా అనేది చూడాలి.

డివివి దానయ్య నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

The post ఫ్యామిలీతో సహా ఓజీ విధ్వంసాన్ని వీక్షించిన పుష్పరాజ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.