Wed. Apr 22nd, 2026

విశాఖపట్నంలోని ద్వారకానగర్‌లో ‘లాడియ డైమండ్ జ్యువెలరీ’ (Ladiya Diamond Jewelry) షోరూమ్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్, సంస్థ డైరెక్టర్ అఖిల్ వేములూరితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ సరికొత్త ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

పర్యావరణానికి హాని కలిగించే మైనింగ్ పద్ధతులకు దూరంగా, అత్యాధునిక సాంకేతికతతో ల్యాబ్-గ్రోన్ డైమండ్స్‌ను తయారు చేస్తున్నట్లు డైరెక్టర్ అఖిల్ వేములూరి తెలిపారు. ఇవి సహజ వజ్రాలతో సమానమైన నాణ్యత, రంగు మరియు స్పష్టతను కలిగి ఉంటాయన్నారు.

నిపుణులైన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ వజ్రాభరణాలు కచ్చితమైన ప్రమాణాలతో రూపుదిద్దుకుంటాయని వివరించారు.
షోరూమ్‌లో నెక్లెస్లు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, పోల్కీ సెట్స్ వంటి అనేక రకాల డిజైన్లు ఉన్నాయని, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా కస్టమైజేషన్ కూడా అందుబాటులో ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా నవంబర్ 29 నుండి డిసెంబర్ 14 వరకు వజ్రాలు మరియు మేకింగ్ చార్జీలపై 15% తగ్గింపును ప్రకటించారు. మహిళలకు నచ్చే అద్భుతమైన డిజైన్లు ఇక్కడ అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని, విశాఖ వాసులు ఈ షోరూమ్‌ను ఆదరించాలని నటి సంయుక్త మీనన్ కోరారు.

The put up విశాఖలో లాడియ డైమండ్ జ్యువెలరీ ప్రారంభించిన సంయుక్త మీనన్ first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.