Tue. Apr 21st, 2026

జాతీయ అవార్డు గ్రహీత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడింది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఇందులో రష్మిక నటనకు మాత్రం విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చేసింది. డిసెంబర్ 5, 2025 నుంచి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం.. ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో చూడాలి.

దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో.. రావు రమేష్, అను ఇమ్మాన్యుయేల్, రోహిణి కీలక పాత్రల్లో మెరిశారు. విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చగా.. ప్రశాంత్ ఆర్. విహారి నేపథ్య సంగీతం అందించారు.

The publish ఓటీటీలోకి రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.