Sat. May 9th, 2026

అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో ‘లవ్ స్టోరీ'(Love Tale) ఒక సూపర్ హిట్ చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన జానపద కళాకారుడిగా చైతన్య తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ భావోద్వేగాలు, సున్నితమైన కథాంశం ఈ సినిమాను ఒక క్లాసిక్‌గా మార్చాయి.

సాయి పల్లవి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించగా, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కులమతాలకు అతీతమైన ప్రేమను వెండితెరపై ఆవిష్కరించింది. ‘నీ చిత్రం చూసి’, ‘సారంగ దరియా’ వంటి హిట్‌ సాంగ్స్ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి. గ్రామీణ తెలంగాణ నేపథ్యం, శేఖర్ కమ్ముల టేకింగ్ ప్రేక్షకులను సినిమాతో మమేకం అయ్యేలా చేశాయి.

ఇక ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ మ్యాజికల్ మూవీని థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం వెండితెరపై మరోసారి ప్రేమ జల్లు కురిపించేందుకు సిద్ధమైంది.

The put up ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న క్యూట్ ‘లవ్ స్టోరి’ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.