తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో ‘జై భీమ్’ ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం, సూర్య మరియు దర్శకుడు టీజే జ్ఞానవేల్ మరోసారి చేతులు కలపబోతున్నారు. జ్ఞానవేల్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, ఇది కూడా ఒక యథార్థ సంఘటనల ఆధారంగా సాగే రియలిస్టిక్ మూవీ అని తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సూర్య సొంత నిర్మాణ సంస్థ ‘జగరం స్టూడియోస్’ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ‘జై భీమ్’ తర్వాత రజనీకాంత్‌తో టీజే జ్ఞానవేల్ చేసిన ‘వెట్టయాన్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈ కొత్త సినిమాతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని దర్శకుడు పట్టుదలతో ఉన్నాడట.
మరోవైపు, సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘కరుప్పు’ మరియు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాల షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ రెండు సినిమాలు కేవలం మూడు నెలల గ్యాప్‌లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో తన 47వ సినిమా షూటింగ్‌లో సూర్య పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్స్ ముగిసిన తర్వాత జ్ఞానవేల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
The submit మరోసారి చేతులు కలపనున్న ‘జై భీమ్’ కాంబో.. ఈసారి కూడా అదే రూట్..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
