Tue. Apr 21st, 2026

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రుక్మిణి వసంత్, కియారా అద్వానీ అలాగే నయనతార ఇలా భారీ తారాగణం కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన క్రేజీ యాక్షన్ చిత్రం “టాక్సిక్” కూడా ఒకటి. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల ఈపాటికే కావాల్సి ఉంది.

అయితే ఈ సినిమా విషయంలో మరో క్రేజీ డీటెయిల్ ఇప్పుడు రివీల్ అయ్యింది. దీని ప్రకారం ఈ సినిమాకి కూడా ఆస్కార్ విన్నింగ్ వి ఎఫ్ ఎక్స్ టీం డీనెగ్ వారు తమ వర్క్ అందించడం విశేషం. వీరే యష్ నటిస్తూ, నిర్మాణం వహిస్తున్న భారీ సినిమా రామాయణ కి కూడా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ గ్యాప్ లో టాక్సిక్ కి కూడా వీరే విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నారు అని తెలియడం టాక్సిక్ కి మరింత వెయిట్ తీసుకొచ్చేలా చేసింది. మరి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఏ లెవెల్లో ఉంటాయో చూడాలి.

The put up ఆస్కార్ విన్నింగ్ వి ఎఫ్ ఎక్స్ టీం ‘టాక్సిక్’ కోసం కూడా first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.