Tue. Apr 21st, 2026

ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న బ్యూటీ కయాదు లోహర్ టాలీవుడ్‌లో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని సరసన ప్రెస్టీజియస్ ‘ది ప్యారడైజ్’ మూవీలో నటిస్తోంది. అయితే, ఆ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై ఇప్పటికే మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ప్యారడైజ్ చిత్రంతో కయాదు లోహర్‌కు వరుస ఆఫర్లు మిస్ అవుతున్నట్లు తెలుస్తోంది.

కయాదు లోహర్ చేతిలో ప్రస్తుతం ఐదుకు పైగా సినిమాలు ఉన్నప్పటికీ, ఆమె కొత్త ప్రాజెక్టులపై సంతకం చేయకపోవడానికి ప్రధాన కారణం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఒప్పందం ప్రకారం, షూటింగ్ ఎప్పుడు ఉన్నా ఆమె అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. కొన్ని నిర్మాణ సంస్థలు ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్నప్పటికీ, మరికొందరు డేట్స్ సమస్య కారణంగా ఆమెను తీసుకోవడానికి వెనకాడుతున్నారు.

అయినప్పటికీ, ‘ది ప్యారడైజ్’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఆమె ఇన్ని అవకాశాలను వదులుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉంది. ఈ సినిమా కోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తే, కయాదు లోహర్ కెరీర్ మరో స్థాయికి చేరుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ప్యారడైజ్ మూవీపై కయాదు లోహర్ భారీ అంచనాలు పెట్టుకున్న మాట మాత్రం వాస్తవం.

The put up ‘ప్యారడైజ్’ తెచ్చిన తంటాలు.. మిస్ అవుతున్న ఆఫర్లు..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.