ప్రేమకథ చిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు ఎ.కరుణాకరన్ కొంత విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టాడు. యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం నేడు గ్రాండ్‌గా ప్రారంభమైంది. గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మౌనికా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రెగ్యులర్‌గా ప్రారంభం కానుంది.
ఈ సినిమాను సరికొత్త న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనుదీప్ కేవీ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటం విశేషం. కరుణాకరన్ మార్క్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌కు అనుదీప్ కామెడీ టైమింగ్ తోడైతే సినిమా మరో స్థాయిలో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం మరో విశేషం.
‘స్వాతిముత్యం’, ‘నేను స్టూడెంట్ సర్’ వంటి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గణేష్, కరుణాకరన్ వంటి దర్శకుడితో చేతులు కలపడంతో ఈ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా రాబోతుందా అనే ఆసక్తి నెలకొంది.
The submit మరో ప్రేమకథ చిత్రాన్ని పట్టుకొస్తున్న కరుణాకరన్.. ఈసారి హీరో ఎవరంటే..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
