Tue. Apr 21st, 2026

మన టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాళవిక నైర్ హీరోయిన్ గా దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన సాలిడ్ రేసింగ్ చిత్రమే “బైకర్”. చూసే ఆడియెన్స్ కి మంచి థ్రిల్ రైడ్ ని పంచిన ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో మరో డీసెంట్ రన్ అందుకుంది. అయితే ఈ ఏప్రిల్ 3న థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా రెండు వారాల రన్ ని పూర్తి చేసుకుంది.

మరి ఈ కొన్ని రోజుల్లో ఈ సినిమా సాలిడ్ వసూళ్లు అందుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మొత్తం 43 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా అందుకుంది. ఇది శర్వానంద్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. మరి ఫైనల్ రన్ కూడా దాదాపు ఇదే అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించగా జిబ్రాన్ సంగీతం అందించారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు ఈ యునిక్ అటెంప్ట్ ని నిర్మాణ విలువలు పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశారు.

The publish ‘బైకర్’ బాక్సాఫీస్.. సాలిడ్ నంబర్స్ తో లేటెస్ట్ వసూళ్లు! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.