Sat. May 9th, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను నార్త్ బెల్ట్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని నార్త్ లో పంపిణీ చేయనుంది. భారీ బడ్జెట్ ఫ్రాంచైజీ ‘ధురంధర్’ను విజయవంతంగా అందించిన జియో స్టూడియోస్, ఇప్పుడు ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న హిందీ బెల్ట్‌లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

​రామ్ చరణ్‌కు హిందీ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘RRR’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా ఆయన కనబరిచిన నటన ఉత్తరాది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ నేపథ్యంలో, ‘పెద్ది’ చిత్రంలోని బలమైన కంటెంట్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మరి నార్త్ లో పెద్ది ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

The publish ‘పెద్ది’ కోసం నార్త్ లో పెద్ద ప్లానింగ్ వేశారుగా..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.