Sat. May 9th, 2026

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కన్నడ స్టార్ రిషబ్‌ శెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకమని రిషబ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా ‘కాంతార’, ‘కాంతార చాప్టర్‌ 1’ చిత్రాల గురించి అమిత్‌ షా ప్రత్యేకంగా ప్రశంసించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన తెలిపాడు.

మన దేశ చరిత్ర, సంస్కృతి మరియు సినిమా మేకింగ్‌పై అమిత్ షాకు ఉన్న అవగాహన తనను ఆశ్చర్యపరిచిందని రిషబ్ కొనియాడాడు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ చిత్రాల విశేషాలను కూడా ఆయనతో పంచుకున్నట్లు వెల్లడించాడు. ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాడు.

ప్రస్తుతం రిషబ్ శెట్టి తెలుగులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘జై హనుమాన్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీలో ఆయన హనుమంతుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.

The put up ఫోటో మూమెంట్ : అమిత్ షాను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార’పై ప్రశంసలు..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.