ప్రముఖ సినీ నిర్మాత, కోలీవుడ్ నటుడు జీవా తండ్రి ఆర్.బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన వార్త సినీ లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సౌత్ ఇండియాలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఆయన భౌతికకాయాన్ని చూసి సినీ ప్రముఖులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ముఖ్యంగా ఈ కష్ట సమయంలో తన ప్రాణ స్నేహితుడు, సహనటుడు జీవాను ఓదార్చే క్రమంలో దళపతి విజయ్ ఎమోషనల్ అయిన తీరు అక్కడి వారందరినీ కలచివేసింది.
ఆర్.బీ చౌదరి మృతి విషయం తెలుసుకున్న వెంటనే విజయ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. నేరుగా జీవా దగ్గరికి వెళ్లి ఆయనను ఆప్యాయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న స్నేహితుడిని చూసి విజయ్ తన కన్నీళ్లను ఏమాత్రం ఆపుకోలేకపోయారు. ఆర్.బీ చౌదరి పార్థివ దేహం వద్ద నిలబడి కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. జీవా చేయి పట్టుకుని విజయ్ భోరుమన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, విజయ్ అంతలా ఎమోషనల్ అవ్వడానికి కేవలం జీవా మీదున్న స్నేహం మాత్రమే కారణం కాదు.. విజయ్ ఈ స్థాయి స్టార్‌డమ్ సొంతం చేసుకోవడం వెనుక ఆర్.బీ చౌదరి పాత్ర ఎంతో ఉంది.
విజయ్ కెరీర్ తొలినాళ్లలో ఆయనకు సరైన బ్రేక్ ఇచ్చిన సినిమా ‘పూవే ఉనక్కాగ’ (తెలుగులో శుభాకాంక్షలు రీమేక్). ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆర్.బీ చౌదరి నిర్మించారు. అప్పటివరకు మాస్ రోల్స్ చేస్తున్న విజయ్‌ని ఒక ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా అది. ఆ తర్వాత ‘లవ్ టుడే’, ‘తుళ్ళద మనముం తుళ్ళుం’ (పవిత్ర ప్రేమ), ‘షాజహాన్’, ‘తిరుప్పాచి’ (అన్నవరం), ‘జిల్లా’ లాంటి ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ విజయ్‌కి ఇచ్చారు. విజయ్ ఎదుగుదలలో ఒక మార్గదర్శిగా నిలిచిన ఆర్.బీ చౌదరి.. దళపతి పాలిట ఒక గాడ్‌ఫాదర్ లాంటి వారని చెప్పాలి.
తన కెరీర్‌ను మలుపు తిప్పిన వ్యక్తి దూరం కావడంతోనే విజయ్ అంతలా చలించిపోయారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను విజయ్‌తోనే తీయాలని ఆర్.బీ చౌదరి ఎన్నో ఏళ్లుగా కలలు కన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆర్.బీ చౌదరి మృతి సౌత్ ఇండస్ట్రీకి తీరని లోటని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
. @TVKVijayHQ @JiivaOfficial pic.twitter.com/utNaEJMbUG
— Laxmi Kanth (@iammoviebuff007) May 6, 2026
The submit Emotional Video: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన దళపతి.. జీవాను ఓదారుస్తూ ఎమోషనల్ అయిన విజయ్ first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
