ఈ ఏడాది ఒకింత పెద్ద హీరోల సినిమాల కంటే యంగ్ హీరోస్ సినిమాలు యువత బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలే పలు భాషల్లో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. అలానే మలయాళ సినిమా నుంచి వచ్చిన ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేసింది. మరి ఆ చిత్రమే ‘వాలా 2’.
దీనికి ముందు వచ్చిన వాలా అక్కడ సెన్సేషనల్ హిట్ కాదా అదే దర్శకుడు పార్ట్ 2 కి పూర్తిగా కొత్త నటీనటుల్ని తీసుకొని దానికి మించిన బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ గ్రాసర్ ని మలయాళ సినిమా దగ్గర సెట్ చేశారు. అయితే ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయగా మన దగ్గరా మంచి వసూళ్లు సాధించి రన్ ని పూర్తి చేసుకుంది.
‘మన శంకర వరప్రసాద్ గారు’ నిర్మాత సాహు గారపాటి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని పాపులర్ సంస్థ జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా నేడు తెలుగు, మలయాళం సహా ఇతర పాన్ ఇండియా భాషలతో మొత్తం 5 భాషల్లో అందుబాటులో ఉంది.
సో ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని అప్పుడు మిస్ అయితే ఇపుడు ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ లు లీడ్ పాత్రల్లో నటించగా సావిన్ ఎస్ ఏ దర్శకత్వం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
The publish స్ట్రీమింగ్ కి బ్లాక్ బస్టర్ ‘వాలా 2’.. పాపులర్ ఓటిటిలో యువతను ఆకట్టుకున్న ఎమోషనల్ డ్రామా first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
