Sat. May 9th, 2026

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ‘పెద్ది’. యువ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా బుకింగ్స్ ఓవర్సీస్ మార్కెట్ లో లేటెస్ట్ గానే విడుదల చేయగా అక్కడ వాటికి సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు అయినట్టు డిస్ట్రిబ్యూస్టర్స్ చెబుతున్నారు.

కేవలం 30 నిమిషాల్లోనే ఈ సినిమా 50 వేల డాలర్స్ గ్రాస్ ని క్రాస్ చేసి దుమ్ము లేపింది. దీనితో పెద్ది బాక్సాఫీస్ తుఫాన్ మొదలైంది అని చెప్పాల్సిందే. ఇదొక సెన్సేషనల్ స్టార్ట్ కాగా ఫైనల్ ప్రీమియర్స్, ప్రీ సేల్స్ గ్రాస్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే వృద్ధి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా జూన్ 3న పైడ్ ప్రీమియర్స్ తో పాన్ వరల్డ్ లెవెల్లో పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.

The publish యూఎస్ మార్కెట్ లో ‘పెద్ది’ తూఫాన్ స్టార్ట్.. 30 నిమిషాల్లో బాక్సాఫీస్ గల్లంతు first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.