Sat. May 9th, 2026

బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రాల్లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘లగాన్’ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అయితే ఈ ఇలాంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన దర్శకుడు అశుతోష్ గౌరీకర్ ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అమీర్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నట్టుగా వచ్చిన టాక్ బాలీవుడ్ వర్గాల్లో కేజ్రీగా మారింది.

అయితే ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ వీరి కలయికలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా వచ్చే అవకాశం ఉందట. 1947 సమయంలో ప్రముఖ క్రికెటర్ లాలా అమర్ నాథ్ జీవిత చరిత్ర ఆధారంగా వీరి కలయికలో సినిమా ఉండొచ్చని ఇప్పుడు వచ్చిన బజ్ మళ్ళీ లగాన్ రోజుల్లోకి అభిమానులని తీసుకెళ్లింది. అది కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమానే కావడం ఇప్పుడు ఈ సినిమా కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో వినిపిస్తుండడంతో ఈసారి అయినా అమీర్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇంకా ఈ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

The put up ‘లగాన్’ కాంబినేషన్ మళ్ళీ.. అమీర్ తో మరోసారి క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.