Sat. May 9th, 2026
NBK112 Update: బాలయ్య-కొరటాల మూవీ.. అస్సలు ఊహించని టైటిల్?

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కబోతోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక పవర్‌ఫుల్ టైటిల్ ఖరారైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో బలమైన సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కార్పెంటర్ అనే టైటిల్‌ను బట్టి చూస్తుంటే.. బాలయ్య పాత్ర ఈసారి చాలా కొత్తగా, లోకల్ సెటప్‌లో అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. బాలకృష్ణ మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ ఎమోషన్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమే. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ ఫామ్‌లో ఉన్న అనిరుధ్.. బాలయ్య సినిమాకు మ్యూజిక్ అందించబోతుండటం ఇదే తొలిసారి.

బాలకృష్ణ ఎనర్జీకి తగ్గట్టుగా అనిరుధ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇస్తారోనని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ మ్యూజికల్ పరంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే కార్పెంటర్ టైటిల్ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.