Sat. May 9th, 2026
Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి

బిగ్‌బాస్ బ్యూటీ, సోషల్ మీడియా సెన్సేషన్ అషురెడ్డి వ్యవహారం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ఎన్నారైని పెళ్లి పేరుతో మోసం చేశారనే కేసులో చిక్కుకున్న ఆమె.. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు హింట్ ఇస్తూ షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోర్టు షాక్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఆమె నిశ్చితార్థం వార్తలు బయటకు రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. అయితే, ఆ ఫొటోల వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది. ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలు అషురెడ్డితో పాటు ఆమె తల్లి యశోదరెడ్డిపై ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును నిలిపివేయాలని (స్టే ఇవ్వాలని) కోరుతూ వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం వారికి గట్టి షాక్ ఇచ్చింది. దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. పోలీసుల కఠిన చర్యల నుంచి మినహాయింపు (ముందస్తు రక్షణ) కల్పించేందుకు కూడా ససేమిరా అంది.

హైకోర్టు తీర్పుతో అషురెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉందని, తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటని అంతా భావిస్తున్న తరుణంలో.. ఆమె ఎంగేజ్‌మెంట్ ఫొటోలు బయటకు రావడం సంచలనంగా మారింది. కేసుల నుంచి జనాల దృష్టి మళ్లించడానికే ఈ పెళ్లి ప్లాన్ అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయి. కానీ, అషురెడ్డికి ఎలాంటి ఎంగేజ్‌మెంట్ కాలేదు! ఆ వైరల్ అవుతున్న ఫొటోలు ఆమె నిజ జీవితానికి సంబంధించినవి కావు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ కోసం అషురెడ్డి ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ సిరీస్ షూటింగ్‌లో భాగంగా తెరకెక్కించిన నిశ్చితార్థం సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలే ఇవి. ఆమె కావాలనే మిస్ లీడ్ చేసేందుకు సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు అనిపిస్తోంది. అందుకే కళ్ళతో చూసేవన్నీ నిజం కాదని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.