Fri. Jul 31st, 2026

హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో పలువురు టాప్ స్టార్స్ మెరిశారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త మరియు ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనస్ ఒకే చోట చేరి స్పెషల్ మూవీ నైట్‌ను ఆస్వాదించారు. ఈ టాప్ స్టార్స్ రాకతో థియేటర్ ప్రాంగణమంతా ఒక్కసారిగా సినీ గ్లామర్‌తో మెరిసిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ స్టార్స్ అందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు కంటికి పండగలా అనిపించింది. AMB సినిమాస్ యాజమాన్యం కూడా ఈ గ్లోబల్ స్టార్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తూ, ఈ క్షణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఇక మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

The publish పిక్ టాక్ : మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ మూవీ నైట్..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.