తమిళనాడులో మరో పొలిటికల్ పార్టీ రెడీ కాబోతుందా అంటే అవుననే అంటున్నారు తమిళ తంబీలు. ఈ డిస్కర్షన్‌కు కారణమయ్యాడు హీరో ధనుష్. తమిళనాడు సీఎం విజయ్ రూట్‌ను అనుసరిస్తూ.. రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఇప్పటి నుండే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ధనుష్ బర్త్ డేని పురస్కరించుకుని ఫ్యాన్స్ నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో చాలా అగ్రెసివ్ స్పీచ్‌తో ధనుష్ 2.0ని చూపించాడు.
ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్ కే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చాడు ధనుష్. మీ చుట్టూ ప్రక్కల ప్రజల అవసరాలను తెలుసుకుని, వారికి సాయం చేయండని, మిమ్మల్ని చూసి తను గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నట్లు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ స్పీచే ధనుష్ రాజకీయాల వైపు అడుగులేస్తున్నాడన్న అనుమానాలు బలం చేకూరేలా చేశాయి. గతంలో ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, భవిష్యత్తులో తన కుమారులు లేదా మనుమలు కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని హింటిచ్చాడు. రాయన్ సినిమాకు జాతీయ అవార్డు రావడంపై తమిళ తంబీల నుండి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చాలా సినిమాలుండగా ఈ మూవీకి ఇవ్వడమేంటనీ పెదవి విరిచారు. సోషల్ మీడియాలో నెగిటివ్‌గా పెద్ద చర్చే నడిచింది. ఈ విషయంపై గట్టిగానే హర్ట్ అయ్యినట్లున్నాడు ధనుష్. పనిలో పనిగా రివేంజ్ తీర్చేసుకున్నాడు. 2024లో రాయన్ కంటే మంచి సినిమాలొచ్చాయని అంగీకరించిన ఈ కోలీవుడ్ హీరో.. గతంలో వడా చెన్నై, కర్ణన్, మరియాన్ చిత్రాలకు జాతీయ అవార్దులు రాలేదని, అప్పుడు 10 శాతం మంది కూడా మాట్లాడుకోలేదని కౌంటరిచ్చాడు.
ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ చెయిర్ ఖాళీగా ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ రిటైర్మెంట్ కు దగ్గరగా వచ్చేయడం, విజయ్ పొలిటికల్ ఎంట్రీ, అజిత్ స్పోర్ట్స్ పై ఎక్కువ కాన్సట్రేషన్ చేయడంతో అక్కడ థియేటర్స్ కు ఫుట్ ఫాల్స్ పెంచే హీరో కరువయ్యాడు. ధనుష్ లేదా సూర్య ఈ ఇద్దరి మధ్యే రేసు కొనసాగుతుంది అనుకున్నారు. కానీ ధనుష్ అగ్రెసివ్ స్పీచ్ చూస్తుంటే త్వరలో పొలిటికల్ పార్టీ పెట్టి.. సీఎం పదవి కోసం పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు క్రిటిక్స్. చూడాలి ధనుష్ అడుగులు ఎటు వైపు అన్నది. ప్రస్తుతం ఓమ్, తమిళ మురుగన్‌తో పాటు భారీ లైనప్ తో బిజీగా ఉన్నాడు హీరో.
