బాలీవుడ్ సినిమా నుంచి ఇప్పుడు రాబోతున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ చిత్రం రామాయణ కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన మరో రామాయణ చిత్రమే ‘ఆదిపురుష్’. దర్శకుడు ఓం రౌత్, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ల కలయికలో వచ్చిన ఈ చిత్రం అనుకున్న అంచనాలు రీచ్ కాలేక చతికిలపడ్డ సంగతి తెలిసిందే.
కానీ ఈ చిత్రం తర్వాత అనౌన్స్ చేసిన రామాయణ వైపే అందరి కళ్ళు పడ్డాయి. ఈ సమయంలో అనేక పోలికలు కూడా రావడం సాధారణం. ఇలా ఫైనల్ గా ట్రైలర్ విడుదల అయ్యాక కూడా మళ్ళీ పోలికలు వినిపిస్తున్నాయి. అయితే ఆదిపురుష్ కంటే ఎన్ని అంశాల్లో రామాయణ గొప్పగా కనిపించినప్పటికీ ఒక్క విషయంలో మాత్రం ఆదిపురుష్ చేసిన మ్యాజిక్ ని రామాయణ మేకర్స్ చేయలేకపోయారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ ఆదిపురుష్ సంగీత దర్శకులు అజయ్, అతుల్ ల ద్వయం చేసిన మ్యూజికల్ మ్యాజిక్ మాత్రం రామాయణ లో కనపడలేదని సోషల్ మీడియాలో ఆడియెన్స్ చెబుతున్నారు. ఆదిపురుష్ ఆల్బమ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వేరే లెవెల్ అని ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు.
The submit ఈ ఒక్క విషయంలో మాత్రం ‘ఆదిపురుష్’ తర్వాతే ‘రామాయణ’ first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
