Wed. Apr 22nd, 2026
Akanda 2 : ‘అఖండ 2’ సంగీతం కోసం.. క్లాసికల్ టచ్‌తో గ్రౌండ్ వర్క్ స్టార్ట్

నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ 2: తాండవం” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం అఖండ ఘనవిజయం సాధించడంతో, సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈసారి కథ, మేకింగ్‌, మ్యూజిక్‌ ప్రతి విభాగంలో కొత్తదనం చూపించాలనే ప్రయత్నం టీమ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్‌, మ్యూజిక్‌ వర్క్ శరవేగంగా సాగుతోంది. అయితే..

Additionally Learn : Abhishek Bachchan: అవార్డులు కొనుక్కుంటాడంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చిన అభిషేక్‌ బచ్చన్‌

మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్‌ ఈ సారి ఎక్కడా తగ్గకుండా మరింత శ్రద్ధతో పని చేస్తున్నాడు. దైవత్వం, శక్తి, ఆధ్యాత్మిక భావాలు కలగలిపిన సౌండ్‌ డిజైన్‌తో ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ ఇవ్వాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. క్లాసికల్ టచ్‌తో పాటలను రూపొందించేందుకు థమన్‌ ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ ప్రారంభించాడు. తాజా సమాచారం ప్రకారం ఇటీవల సంస్కృత సాహిత్యం కోసం మిశ్రా సోదరులను కలిసి పనిచేసిన థమన్, ఇప్పుడు ప్రముఖ క్లాసికల్ సింగర్స్ సర్వేపల్లి సిస్టర్స్ తో కలిసి డివోషనల్ ట్రాక్స్ రికార్డ్ చేస్తున్నాడట.మొదటి భాగంలో ‘జై బాలయ్య’, ‘అధరహమం’ వంటి పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇప్పుడు ‘అఖండ 2’లో థమన్‌ మరింత ఆధ్యాత్మికత, శక్తివంతమైన బీట్‌లతో ఆ అనుభూతిని రెట్టింపు చేయబోతున్నాడు.