Fri. Apr 17th, 2026

Atu Friend Itu Lover చిత్రం ట్రైలర్ తాజాగా ఘనంగా విడుదలైంది. ఫ్యాషన్ హంట్ సమర్పణలో ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ romantic entertainer కు నజీం ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రిన్స్ మరియు సాంచి కశ్యప జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే మంచి buzz ను క్రియేట్ చేస్తోంది.

హీరో ప్రిన్స్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డామని తెలిపారు. director నజీం ఎస్ కథను చాలా engaging గా తెరకెక్కించారని చెప్పారు. తెలుగు audience ఎప్పుడూ మంచి content ను ఆదరిస్తారని, ఈ movie కూడా అందరిని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంచీతో కలిసి పని చేయడం మంచి experience గా ఉందని చెప్పారు.

హీరోయిన్ సాంచి కశ్యప మాట్లాడుతూ ఈ సినిమాలో అవకాశం రావడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ project కోసం టీమ్ అందరూ hard work చేశారని తెలిపారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

దర్శకుడు నజీం ఎస్ మాట్లాడుతూ కొత్త director అయినా కూడా టీమ్ అందరూ తనకు full support ఇచ్చారని చెప్పారు. ఈ సినిమా ఒక fresh love storyగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. music director ప్రణీత్, cinematographer రాము రాయల్ తమ technical work తో సినిమాకు మంచి quality తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.