Wed. Apr 22nd, 2026
#Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

టాలీవుడ్ యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన చివరిగా ‘భీమా’ (Bhimaa) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా తనదైన శైలిలో మెప్పించినా, కమర్షియల్ గా ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తాజాగా గోపీచంద్ తన తదుపరి చిత్రం కోసం ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.

Additionally Learn : Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ఆయన 33వ సినిమా (#Gopichand33) టైటిల్ గ్లింప్స్‌ను రేపు (ఏప్రిల్ 13, సోమవారం) ఉదయం 11:17 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధికారికంగా ప్రకటించింది. “An untold bankruptcy from a undying age of glory” అంటూ వచ్చిన క్యాప్షన్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఇందులో భక్తి, పురాణ నేపథ్యం ఉన్నట్లు హింట్ ఇస్తూ మేకర్స్ పోస్టర్‌ను డిజైన్ చేశారు.

ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి (Sankalp) దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి విలక్షణమైన సినిమాలతో తన మార్క్ చాటుకున్న సంకల్ప్, ఇప్పుడు గోపీచంద్‌ను ఒక సరికొత్త అవతారంలో చూపించబోతున్నారు. ఇందులో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, గోపీచంద్ కెరీర్‌లోనే ఇది ఒక విభిన్నమైన సినిమా అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రేపు రిలీజ్ కాబోయే టైటిల్ గ్లింప్స్‌తో ఈ సినిమా కథేంటనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.