Sat. May 9th, 2026
OG : పవన్ ను చూస్తే గర్వంగా ఉంది.. చిరు పొగడ్తలు

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన ఓజీ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ ఈ మూవీ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు. తాజాగా మెగా హీరోలు అందరూ కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ఓజీ సినిమా చూశారు. చిరంజీవి, సురేఖ, పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్‌, సాయిదుర్గాతేజ్, వరుణ్‌ తేజ్, అకీరా, వైష్ణవ్, మనవరాళ్లతో కలిసి మూవీ చూశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా ఫ్యామిలీతో కలిసి మూవీ చూశాను. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. సుజీత్ డైరెక్షన్ అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు సుజీత్ పనితనం కనిపిస్తోంది.

Learn Additionally : Rishab Shetty : ఆఫీస్ బాయ్ నుంచి వందల కోట్ల దాకా.. రిషబ్ శెట్టి లైఫ్..

పవన్ కల్యాణ్‌ ను ఇలా చూడటం చాలా గర్వంగా అనిపిస్తోంది. అతని స్క్రీన్ ప్రజెన్స్ సూపర్. ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నందుకు ఓజీ సినిమాతో పవన్ కల్యాణ్‌ మంచి ట్రీట్ ఇచ్చాడు. తమన్ తన హార్ట్ నుంచి ఈ మ్యూజిక్ అందించినట్టు అనిపించింది. ఈ సినిమా విషయంలో అందరూ కష్టపడి పనిచేశారు. విజువల్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఆయన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది.

Learn Additionally : ఓజీ మూవీ చూసిన చిరు, చరణ్‌, మెగా హీరోలు