Wed. Apr 22nd, 2026
Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువీర్. ‘మసూద’, ‘పరేషాన్’ వంటి చిత్రాలతో నటుడిగా తన సత్తా చాటిన ఆయన, ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ (Papam Pratap) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే వింతైన పరిస్థితుల వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఆ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాడు అనే అంశాన్ని చాలా వినోదాత్మక గూఢచారి తరహాలో చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Additionally Learn : Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

ఎస్‌.పీ దుర్గ నరేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తిరువీర్ మార్క్ మేనరిజమ్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను పక్కాగా ఎలివేట్ చేశాయి. హీరో ప్రతాప్ పడే కష్టాలు నవ్వులు పూయించడమే కాకుండా, కథలో ఏదో బలమైన ఎమోషనల్ పాయింట్ కూడా ఉందనే సంకేతాన్ని ఇస్తున్నాయి. పాయల్ రాధాకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, తిరువీర్ కెమిస్ట్రీ ఆమెతో కొత్తగా ఉండబోతోంది. ఏ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన తిరువీర్ గత చిత్రాల రికార్డును ‘పాపం ప్రతాప్’ కూడా కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.