Mon. Jul 27th, 2026

ఓటీటీ వేదిక : ఈటీవీ విన్

ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : 26 జూలై , 2026

123తెలుగు.కామ్ రేటింగ్ 3/5

నటీనటులు : శశాంక్, అన్విష, రాశీ, మాస్టర్ దక్షేష్ తదితరులు
దర్శకత్వం : వర ముళ్ళపూడి
నిర్మాణం : అనుపమ చంద్ర కోడూరి, శరత్ చంద్ర రెడ్డి గుర్రాల
సంగీతం : సాయి మధుకర్
ఛాయాగ్రహణం : మురళీ మోహన్ చేగు
కూర్పు : రాఘవేంద్ర వర్మ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

మన తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రమే ‘జాతి రత్నం’. శశాంక్, రాశీ వంటి ప్రముఖ నటుల కలయికలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

పేరుకి ఉద్యోగం చేస్తాడు కానీ గ్రహాలు, నమ్మకాలు వంటివి బాగా నమ్మే మూర్ఖుడు విక్రమార్క (శశాంక్), తన భార్య అనిత (అన్విష) అంటే ఎంతో ఇష్టం, వారిద్దరూ విక్కీ అత్త భైరవి (రాశీ) అంతా కలిసి ఓకే ఇంట్లో ఉంటారు. అయితే వీరికి మూడేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని అల్లుడికి విడాకులు ఇప్పించేసి భైరవి తన కూతురుకి వేరే సంబంధాలు చూడడం మొదలు పెడుతుంది. ఇంకోపక్క వారి ఇంటి దగ్గరలోనే ఉండే చిన్న పిల్లాడు సూరి (మాస్టర్ దక్షేష్) విక్కీని తన నమ్మకాల విషయంలో బాగా ఇరిటేట్ చేస్తుంటాడు. ఓ పక్క తన నమ్మకాలు, ఇంకోపక్క పర్శనల్ సమస్యలు, ఈ అంతటిలో విక్రమార్క ఏం చేసాడు? చివరికి ఏం తెలుసుకున్నాడు అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఇందులో ప్రధాన బలం ఏదన్నా ఉంది అంటే సినిమా కాన్సెప్ట్ తో పాటుగా దానిని మంచి ఎమోషన్స్ తో దర్శకుడు నడిపించిన తీరు అని చెప్పవచ్చు. ఎప్పుడు అయితే పాత్రల నడుమ కీలక అంశం సీరియస్ అవుతుందో అక్కడ నుంచి కథనం బలంగా మారింది.

అక్కడ నుంచి చివరి వరకు దర్శకుడు కదిలించే ఎమోషన్స్ తో నడిపించిన తీరు బాగుంది. ఇక ఈ క్రమంలో నటుడు శశాంక్ తన పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్టయ్యి చాలా బాగా చేసాడు. పూర్తిగా మూఢ నమ్మకాలు కలిగిన మిడిల్ క్లాస్ వ్యక్తి పాత్రలో కామికల్ గా మూర్ఖంగా కనిపిస్తూనే తర్వాత ఎమోషనల్ చేస్తాడు.

అలానే నటి రాశి కూడా ఇందులో బాగా చేశారు. ఆమెపై సన్నివేశాలు, కొన్ని చోట్ల ఆమె నటన పర్ఫెక్ట్ గా ఉన్నాయి. వీరితో పాటుగా అన్విష కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఇందులో స్పెషల్ పాత్రలో కనిపించిన మాస్టర్ దక్షేష్ కూడా తన పాత్రకి బలంగా నిలిచాడు. వీటితో పాటుగా అంతర్లీనంగా ప్లాన్ చేసుకున్న సందేశం కూడా డీసెంట్ గా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో మొదటి కొన్ని నిమిషాలు శశాంక్ రోల్ ఇలా ఉంటుంది అని ప్రెజెంట్ చేయడానికి కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. పైగా మధ్యలో ఓ పాట ఇవన్నీ ఫ్లోలో కొంచెం అనవసరం అనిపిస్తాయి. వీటితో పాటుగా ఓ కీలక సమయంలో ట్విస్ట్ సింపుల్ గా ఊహించేయవచ్చు.

ఇక్కడే చిన్న లాజిక్ కూడా మిస్ అయినట్టు అనిపిస్తుంది. సూరి పాత్ర ఇంటికీ విక్కీ ఇంటికి కొంచెం దూరం ఉంటుంది అలాంటిది ఎక్కడో ఇంటి లోపల నుంచి అరుపులు వినిపించి వెళ్లిపోవడం కొంచెం లాజిక్ లేనట్టు అనిపిస్తుంది. పిల్లాడిని ఆ ఇంటి ప్రాంగణంలో చూపించినా సరిపోయేది. ఇంకా క్లైమాక్స్ లో ఎమోషనల్ పార్ట్ ఇంకా బలంగా డిజైన్ చేసి ఉంటే మరింత బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఇందులో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. అన్ని వర్గాల్లో పనితీరు బాగుంది. సంగీతం, కెమెరా వర్క్ లు డీసెంట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ లో కొంచెం నిడివి తగ్గించాల్సింది. ఇక దర్శకుడు వర ముళ్ళపూడి విషయానికి వస్తే.. తన వర్క్ ఇందులో బాగానే ఉంది. గత లఘు చిత్రం ‘గొల్ల రామవ్వ’తో ఇంప్రెస్ చేసిన తన నుంచి ఇది మరో డీసెంట్ అటెంప్ట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో ఎమోషనల్ పార్ట్ ని తాను ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. క్లైమాక్స్ లో ఇంకా ఎక్కువ జోడించినా బాగుండేది. కొన్ని లాజిక్స్ మిస్ చేశారు కానీ మిగతా వర్క్ బాగానే ఉంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘జాతి రత్నం’ లఘు చిత్రం ఓ డీసెంట్ ఎమోషనల్ డ్రామాగా నిలిచింది. ప్రధాన పాత్రల్లో నటీనటులు మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. మొదటి కొన్ని నిమిషాల తర్వాత నుంచి కథనం ఎమోషనల్ గా తీసుకెళ్లి ముగించిన తీరు, మెసేజ్ లు ఇందులో బాగున్నాయి. కొన్ని లోపాలు ఉన్నాయి కానీ వాటిని పక్కన పెడితే ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ లఘు చిత్రం మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.

123telugu.com Score: 3/5

Reviewed via 123telugu Group

The publish ఓటిటి సమీక్ష: ‘జాతి రత్నం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.