Mon. Jun 29th, 2026

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’ రిలీజ్ కి రాబోతుండగా ఇది కాకుండా ఓ పవర్ఫుల్ సబ్జెక్టుతో విశ్వక్ సేన్ రానున్న కొత్త ఏడాదిలో పలకరించనున్నాడని తెలుస్తుంది. అయితే మరోసారి విశ్వక్ సేన్ పొలిటీషియన్ పాత్రలో షైన్ కానున్నాడట.

ఆల్రెడీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో సాలిడ్ రోల్ తాను చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి ఒక ఫుల్ లెంగ్త్ పొలిటికల్ డ్రామాలో తాను నటించనున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ రేపే జనవరి 1, 2026న వస్తుంది అని గట్టి టాక్ వినిపిస్తుంది. అలాగే కళాహీ మీడియా వారు కూడా లేటెస్ట్ గా ఇచ్చిన అనౌన్సమెంట్ తో ఇదే కాంబినేషన్ దాదాపు అనౌన్స్ కాబోతుంది అని టాక్. సో దీనిపై రేపటితో ఓ క్లారిటీ బయటకి వచ్చేస్తుంది.

The publish మళ్ళీ పొలిటీషియన్ గా మాస్ కా దాస్.. కొత్త ప్రకటన రేపే!? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.