ప్రస్తుతం వెంకీ మామ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న వెంకీ మామతో త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే అందరిలో సరికొత్త అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కొత్తగా హర్షవర్ధన్ రామేశ్వర్ తో సంగీతం చేస్తుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కానీ ఇటీవల ఈ సినిమా నుంచి హర్షవర్ధన్ తప్పుకున్నట్టుగా ఓ టాక్ వైరల్ అయ్యింది. తనని థమన్ రీప్లేస్ చేసినట్టు కూడా మేము తెలియజేసాం. ఇక దీనిపై ఫైనల్ గా థమన్ నుంచే క్లారిటీ వచ్చేసింది.
తాను త్రివిక్రమ్ తో కలిసి ఓ పిక్ ని ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసుకొని ఆదర్శ కుటుంబం లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. అరవింద సమేత నుంచి మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు ఆదర్శ కుటుంబం వరకు వచ్చి త్రివిక్రమ్ సినిమానే ‘అఆ’ లా మారింది అని చెప్పొచ్చు. ఇక ఈసారి వీరి కలయికలో ఎలాంటి మ్యూజికల్ మ్యాజిక్ జరుగుతుందో చూడాలి.
The put up అఆ.. ‘ఆదర్శ కుటుంబం’లోకి థమన్ అఫీషియల్ ఎంట్రీ! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
